SKLM: మానవాళి మహోదయానికి క్రీస్తు బోధనలు ఎంతో దోహదపడతాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. క్రిస్మస్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమను పంచడమే క్రిస్మస్ సందేశమని పేర్కొన్నారు. క్రీస్తు బోధనలు సమాజంలో ప్రేమ, కరుణ, శాంతిని పెంపొందిస్తాయని ఆయన వెల్లడించారు. క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.