PLD: వినుకొండ పట్టణంలోని చెక్‌పోస్టు సెంటర్ వద్ద గురువారం ఫోర్‌వీలర్ ఆటో అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లిన ఘటనలో ఒక బాలుడు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో అక్కడ నిలిపి ఉన్న పలు ద్విచక్ర వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.