NLG: నల్గొండ మండలంలోని దండంపల్లిలో వైరల్ ఫీవర్తో పలువురు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి చెందిన ఓ మహిళ ఇటీవల నల్గొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోగా ఆమెకు డెంగీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వైద్య సిబ్బంది వారం రోజులుగా గ్రామంలోని పలు వార్డుల్లో ఫీవర్ సర్వేతో పాటు గ్రామస్థులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు.