KNR: శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన లెంకల శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో ఉండగా కోతుల గుంపు దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి కోతులను తరిమివేసి ప్రాథమిక చికిత్స కోసం పీహెచ్‌సీకి తరలించారు. గాయాలు ఎక్కువగా ఉండటంతో అనంతరం కరీంనగర్ ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు.