TG: ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండేందుకు ఇంటర్ బోర్డు పలు వినూత్న చర్యలు చేపట్టనుంది. వార్షిక పరీక్షలకు రెండు నెలల ముందే తల్లిదండ్రుల వాట్సాప్‌నకు వారి పిల్లల హాల్ టికెట్లను పంపనున్నారు. హాల్ టికెట్ నంబర్, పరీక్షా కేంద్రం చిరునామాతో పాటు ఏ రోజు ఏ పరీక్ష జరగుతుందో తల్లిదండ్రులకు చెప్పడమే ప్రధాన ఉద్దేశం.