AP: తూ.గో(D) రంపచోడవరం(M) పోలవరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు మృతి చెందారు. క్రిస్మస్ సెలవు కావడంతో స్వస్థలాలకు వెళ్లేందుకు బైక్పై వెళ్తూ.. ఆగి ఉన్న కారును ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సందీప్(34) అక్కడికక్కడే మృతి చెందగా.. విద్యాసాగర్(38) ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.