PDPL: ముత్తారం మండలం మచ్చుపేట గ్రామంలో 108 ఎమర్జెన్సీ సర్వీస్‌ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బుధవారం రాత్రి ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దుండె రాజేశం విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఉప సర్పంచ్ దొంతుల రాకేష్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో సొంత డబ్బులు రూ. 30వేలతో ఏర్పాటు చేసిన బోరు ప్రారంభించారు.