డిజిల్ ట్యాంకర్ NH48పై డివైడర్ను దాటి రాంగ్ రూట్లో బస్సును ఢీకొట్టడం కారణంగానే కర్ణాటక రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి 2 గంటల తర్వాత చిత్రదుర్గ జిల్లా గోర్లతు గ్రామంలో ఈ ఘటన జరగ్గా.. ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రైవేట్ ట్రావెల్ బస్సు పూర్తిగా దహనమైంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 17 మంది మరణించగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.