విశాఖ స్టీల్ ప్లాంట్లో 3వ విడత VRS పథకాన్ని యాజమాన్యం బుధవారం ప్రకటించింది. 2027 జనవరి 1వ తేదీ తర్వాత పదవీ విరమణకు అర్హులయ్యే ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. 2026 జనవరి 1-20 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో మాత్రమే స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది. కనీసం 15 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి, 45 ఏళ్లు దాటిన ఉద్యోగులు అర్హులన్నారు.