KRNL: సీఎం చంద్రబాబు హామీ మేరకు బుధవారం పాస్టర్లకు రూ.50.10 కోట్లు గౌరవ వేతనం చెల్లించినట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. 2024 డిసెంబర్ నుంచి 2025 నవంబర్ వరకు రూ.5వేల చొప్పున 8,427 మంది అకౌంట్లలో డబ్బులు జమ చేసినట్లు వెల్లడించారు. క్రిస్మస్ పురస్కరించుకుని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, దయాగుణాన్ని ఇతరులకు పంచాలని మంత్రి కోరారు.