KNR: స్థానిక 23వ డివిజన్ పరిధిలోని సూర్య నగర్లో బుధవారం ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ సత్తు మల్లేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు బంగుటపు రాజమౌళి, కొలుపుల మోహన్, రాచమల్ల రవి, శనిగరం నరసయ్య, ఎరోజు వెంకటేశ్వర్లు, అమరేందర్ రెడ్డి, శ్రీగిరి సతీష్, బత్తిని కనకయ్య, కంకణాల అంజిరెడ్డి, జంగిలి ప్రశాంత్ పాల్గొన్నారు.