NLG: క్రైస్తవుల ప్రధాన పండుగ అయిన క్రిస్మస్ రావడంతో చర్చ్‌లలో దైవ ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. నల్లగొండ–దేవరకొండ రోడ్డులోని మరియ గుట్ట, మరియ మాత చర్చితో పాటు పలు చర్చీలు క్రిస్మస్ వేడుకలకు ముస్తాబయ్యాయి. ప్రత్యేక అలంకరణలతో చర్చీలు అందంగా అలరారుతున్నాయి. క్రీస్తు జన్మదినమైన డిసెంబర్ 25న క్రైస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకుంటారు.