TG: మహానగరంగా మారిన HYD పర్యవేక్షణ, పరిపాలన కష్టమని భావిస్తున్న సర్కార్.. దాన్ని 3 ముక్కలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ 3 నగరాలతో పాటు నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీ ఉంటుంది. 2026 FEB 10న GHMC పాలకవర్గం గడువు ముగియనుంది. అప్పటివరకు 300 వార్డులతో కూడిన GHMCగానే ఉంటుందని, ఆ తర్వాత 100 వార్డులతో 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేయనుందని సమాచారం.