VSP: విశాఖలో పబ్బులు, వైన్ షాపుల వద్ద సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయి. సీపీ శంఖబ్రత్ బాగ్చి బుధవారం పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి, పరిమితిని మించి మనుషులను అనుమతించడం, అధిక శబ్దం, షాపులు సమయం దాటడం వంటి పరిస్థితుల్లో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కస్టమర్ల భద్రత కోసం షాపుల ముందు సీఐ, సీపీ నంబర్లు స్పష్టంగా ప్రదర్శించాలని ఆయన తెలిపారు.