GDWL: మల్దకల్ మండల కేంద్రంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, జిల్లా విద్యాశాఖ అధికారులు బుధవారం ఇక్కడ పర్యటించి అనువైన స్థలాన్ని పరిశీలించారు. వర్సిటీ స్థాపనకు మల్దకల్ పరిసర ప్రాంతాలు భౌగోళికంగా అనుకూలంగా ఉంటాయని ప్రాథమికంగా గుర్తించారు.