VSP: గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని అనాథ మృతదేహానికి బుధవారం ఆవర్ హ్యాండ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసుల సమాచారంతో స్పందించిన సంస్థ ప్రతినిధి పిల్లి గోవింద రాజు స్వంత ఖర్చులతో దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఈ మానవతా సేవను స్థానికులు అభినందించారు.