CTR: బంగారుపాళ్యం మండలం తుంబకుప్పంలో విషాద ఘటన వెలుగు చూసింది. స్థానికంగా ఉన్న బిక్కిరెడ్డి చెరువులో ఓ శిశువు మృతదేహం కలకలం రేపింది. అటుగా వెళ్లిన పశువుల కాపర్లు బుధవారం మధ్యాహ్నం చెరువులో శిశువు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.