ఇండిగో సంక్షోభం నెలకొన్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో మరో రెండు విమానయాన సంస్థలకు పౌరవిమానయాన శాఖ అనుమతి ఇచ్చింది. అల్ హింద్, ఫ్లై ఎక్స్‌ప్రెస్ సంస్థలకు అనుమతి ఇచ్చినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఇటీవలే శంఖ్ ఎయిర్‌కు కేంద్రం అనుమతి ఇవ్వగా.. త్వరలోనే సంస్థ సర్వీసులు ప్రారంభించనుంది.