TG: మరో రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ CM అవుతారని బీఆర్ఎస్ నేత హరీష్రావు ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలను, ప్రజలను ఇబ్బందులు పెడుతున్న వారి పేర్లు రాసిపెట్టుకుంటున్నామని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ భయపడుతోందని విమర్శించారు.