విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ చెలరేగాడు. సిక్కింతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై బ్యాటర్ రోహిత్ శర్మ 62 బంతుల్లో (100*) సెంచరీ చేశాడు. తొలుత సిక్కిం 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై 150/1 పరుగులతో ఉంది.