KRNL: PPP విధానంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం పిలిచిన టెండర్లకు స్పందన రాలేదు. తొలి విడతలో ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందులలో కళాశాలలను PPP మోడల్లో నిర్వహించేందుకు వైద్యారోగ్య శాఖ టెండర్లు పిలిచింది. టెండర్ల గడువు 2సార్లు పొడిగించినా.. ఆదోని కళాశాలకు మాత్రమే ఒక్క బిడ్ దాఖలైంది. దీనికి గల కారణాలపై చర్చిస్తామని అధికారులు తెలిపారు.