KDP: సిద్ధపటం మండలం భాకరాపేట సమీపంలోని మలినేనిపట్నం గ్రామం కడప-చెన్నై జాతీయ రహదారిలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కడప నుంచి రాజంపేటకు వెళుతున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు, కడప వైపు వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులోనే పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.