ప్రకాశం: భారతదేశ రాజకీయాలలో సిపిఐ పార్టీ వందేళ్ల త్యాగాల, పోరాటాల ప్రజాప్రస్థానం గర్వించదగినదని, పేదల పక్షాన అలుపెరిగిన పోరాటాలు చేసేది కమ్యూనిస్టులే అని సిపిఐ మండల కార్యదర్శి రామారావు అన్నారు. బుధవారం కనిగిరిలో CPI వందేళ్ళ వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా పట్టణంలోని హనీఫ్ నగర్ శాఖలో హనీఫ్ స్మారక స్తూపం వద్ద CPI జెండాను రామారావు ఎగురవేయడం జరిగింది.