ADB: తలమడుగు మండలంలోని పల్సీ(బీ) గ్రామంలో బోథ్ MLA అనిల్ జాదవ్ బుధవారం పర్యటించారు. గ్రామానికి చెందిన సేద్మకి కిషన్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకొని MLA అనిల్ జాదవ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.