విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ కెప్టెన్ షకిబుల్ గని సరికొత్త చరిత్ర సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లపై అతడు విరుచుకుపడ్డాడు. కేవలం 32 బంతుల్లోనే మెరుపు సెంచరీ సాధించాడు. ఇదే మ్యాచ్లో 36 బంతుల్లో సెంచరీ చేసిన వైభవ్ రికార్డును షకిబుల్ బ్రేక్ చేయడం గమనార్హం. భారత్ తరఫున లిస్ట్ ఏ క్రికెట్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం.