మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 26 ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరులు ఏకమవుతున్నారు. రాజ్‌ఠాక్రే, ఉద్ధవ్‌ఠాక్రే కలిసి సమావేశం నిర్వహించారు. ఇద్దరం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు ఠాక్రే సోదరులు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కూటమిగా శివసేన, ఎంఎన్ఎస్ పోటీచేయనుంది. అంతకుముందు బాల్ ఠాక్రే సమాధి వద్ద వారు నివాళులర్పించారు.