NDL: ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీ కార్యాలయంలో జరిగిన రూ.1.16 కోట్ల నిధుల అవకతవకలకు సంబంధించి 4 వైద్యాధికారులపై కేసులు నమోదయ్యాయి. అహోబిలం ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డాక్టర్లు వాణి, బాబు, నాగ మస్తాన్, నాగ దాసయ్యలపై ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా సబ్ ట్రెజరీ అధికారిణి లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు SI వరప్రసాద్ తెలిపారు.