GNTR: అమరావతిలో ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ విగ్రహం, స్మారక కేంద్రం పనుల పర్యవేక్షణకు ఏపీ ప్రభుత్వం మంత్రుల బృందాన్ని నియమించింది. విగ్రహ డిజైన్, స్థలం ఖరారు, డీపీఆర్ పరిశీలన, చెరువు చుట్టూ వాణిజ్య అభివృద్ధిపై ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది. పురపాలక, ఆర్థిక, పర్యాటక, రెవెన్యూ, వైద్యారోగ్య శాఖల మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు.