NLR: జిల్లా సంగం, ముత్తుకూరు, బుచ్చి తదితర మండలాల్లో అక్రమ చేపల సాగు యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఫంగస్, రూప్‌చంద్ రకాలను సాగుచేస్తూ.. కోళ్ల వ్యర్థాలను వాడుతున్నారు. దీనివల్ల పర్యావరణం దెబ్బతింటున్నా, సాగుదారులు ఏటా రూ.49.8 లక్షల విద్యుత్ రాయితీ పొందుతున్నారు. మొత్తం 1,400 ఎకరాల్లో ఈ దందా సాగుతుండగా, జేడీ శాంతి తనిఖీలు చేసి యజమానులకు నోటీసులు జారీ చేశారు.