TG: మేడారంలో ఆదివాసీల పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గోవిందరాజు, పగిడిద్దరాజు ప్రతిరూపాలతో పూజారులు కాలినడకన బయలుదేరారు. గద్దెల వద్దకు చేరుకున్నాక పగిడిద్దరరాజు, గోవిందరాజు గద్దెలను పునఃప్రతిష్ట చేస్తారు. ఈ నేపథ్యంలో మేడారంలో ఈ రోజు భక్తుల దర్శనాలకు విరామం ఇచ్చారు.