మరో 10 శాతం వలసలు పెరిగితే బంగ్లాదేశ్‌లో అసోం కలిసిపోతుందని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40 శాతం బంగ్లాదేశీ మూలాలున్న వ్యక్తులున్నారని తెలిపారు. బంగ్లాను అస్థిరపరిస్తే సెవెన్ సిస్టర్స్‌ను ముట్టడిస్తామని ఇటీవల బంగ్లా నాయకుడు హస్నత్ అబ్దుల్లా హెచ్చరించారు. దీనిపై స్పందించిన హిమంత బిశ్వశర్మ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.