KDP: అగస్త్యేశ్వరాలయంలో అమ్మవారికి చెందిన 28.30 గ్రా. బంగారం హారం కనిపించలేదని జ్యూవెలరీ వెరిఫికేషన్ అధికారి పాండురంగారెడ్డి తెలిపారు. అలాగే 263.90 గ్రా.వెండి వస్తువులు కనిపించలేదన్నారు. 2 రోజుల పాటు అధికారులు బంగారు, వెండి ఆభరణాలను లెక్కించారు. రికార్డుల ప్రకారం 836 గ్రాముల బంగారు ఆభరణాలు, 141.625 కేజీలు వెండి వస్తువులు ఉండాలి లెక్కింపులో తక్కువ ఉన్నాయన్నారు.