TG: నారాయణపేట్ జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ క్రమంలో కోస్గిలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనం’లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా వారితో ముఖాముఖి మాట్లాడి, గ్రామాల అభివృద్ధిపై దిశానిర్దేశం చేస్తారు. సన్మాన కార్యక్రమం అనంతరం నూతన సర్పంచ్లతో కలిసి సీఎం మధ్యాహ్న భోజనం చేస్తారు.