NRPT: మక్తల్ పట్టణంలో రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఉదయం 6 గంటల నుంచే బైక్పై సుడిగాలి పర్యటన చేపట్టారు. పలు వార్డుల్లో గల్లీగల్లీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులపై అధికారులకు సూచనలు ఇచ్చారు. త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు. మంత్రి విస్తృత పర్యటనతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.