SRD: పటాన్ చెరు డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో డ్రైనేజీ సదుపాయం లేమితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు. శాంతినగర్, బాలాజీ నగర్, నూతన వ్యవసాయ మార్కెట్ ప్రాంతాల్లో అంతర్గత డ్రైనేజీ నిర్మాణానికి రూ.40 లక్షల నిధులు మంజూరు చేయాలని HMWS & SB ఎండీ అశోక్‌కు వినతిపత్రం అందజేశారు. పనులు త్వరగా ప్రారంభించాలని కోరారు.