AKP: ఫోర్జరీ పత్రాలతో భూమిని విక్రయించిన పరవాడ మండలం తిక్కవానిపాలెం గ్రామానికి చెందిన టీ.సత్యనారాయణను అరెస్ట్ చేసినట్లు సీఐ మల్లికార్జునరావు మంగళవారం తెలిపారు. అదే మండలం వాడ చీపురుపల్లి పరిధిలో 321 సర్వే నెంబర్లో 6.86 ఎకరాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విక్రయించాడు. దీనిపై భూమి యజమాని ఎం. సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.