ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. ఇవాళ ఉదయం 8.54 గంటలకు శ్రీహరికోట నుంచి LVM3-M6 (బాహుబలి) రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇది మోసుకెళ్తోంది. శ్రీహరికోట స్పేస్ పోర్ట్‌లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి జరిగే ఈ ప్రయోగం కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆల్ ది బెస్ట్ ఇస్రో.