NZB: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ, సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి స్పష్టం చేశారు. రూరల్ నియోజకవర్గ స్థాయి ముందస్తు క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారు.