VSP: ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే గుడ్మార్నింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం 4వ జోన్ 30వ వార్డులోని బెల్లం వినాయక ఆలయం పరిసర ప్రాంతాల్లో కార్పొరేటర్ కోడూరు అప్పల రత్నం, జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడుతో కలిసి పర్యటించారు. ఈ సందర్బంగా పారిశుధ్యం, తాగునీరు, వీధిదీపాలు, కాలువల సమస్యలను పరిశీలించారు.