ATP: ప్రజాసమస్యలపై పోరాడి పరిష్కార మార్గాలు చూపిన మొట్టమొదటి పార్టీ సీపీఐ అని జిల్లా కార్యదర్శి నారాయణస్వామి పేర్కొన్నారు. మంగళవారం సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా గుంతకల్లు పట్టణంలో బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సీపీఐ పార్టీ ఏర్పడి డిసెంబర్ 26కు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు.