»Prabhas Security Budget In Adipurush Pre Release Event
Adipurush : ఆదిపురుష్ ఈవెంట్లో ప్రభాస్ సెక్యురిటీ ఖర్చు ఎంతో తెలుసా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్(Om raut) కాంబినేషన్లో వచ్చిన పౌరాణిక చిత్రం `ఆదిపురుష్`(Adipurush). రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయించారు.
Adipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్(Om raut) కాంబినేషన్లో వచ్చిన పౌరాణిక చిత్రం `ఆదిపురుష్`(Adipurush). రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్(Krithi sanon), రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. జూన్ 16న ఈ చిత్రం వివిధ భాషల్లో విడుదల కానుంది.
ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న రాత్రి తిరుపతిలో ఆదిపురుష ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి తారకరామ స్టేడియంలో దాదాపు రెండున్నర కోట్లు వెచ్చించి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక గురువు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లు ప్రభాస్, కృతి సనన్, చిత్ర బృందం మొత్తం పాల్గొన్నారు.
ఆదిపురుష ప్రీ రిలీజ్ ఈవెంట్ వేలాది మంది అభిమానుల మధ్య కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా ఆదిపురుషులు రెండో ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఈ ఈవెంట్లో ప్రభాస్ సెక్యూరిటీ ఖర్చు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి 1000 మంది పోలీసులు వచ్చారు. అలాగే మరో వెయ్యి మంది ట్రాఫిక్‌ను, ప్రజలను పర్యవేక్షించారు. ప్రభాస్ కోసం ప్రైవేట్ సెక్యూరిటీ, బాంబ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. పోలీసుల భద్రతతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసేందుకు నిర్మాతలు రూ. 25 లక్షలు ఖర్చు చేశారు.