NRPT: కోటకొండ గ్రామంలోని వ్యాపారస్తులను సీపీఐ మాస్ లైన్ నాయకులు వేధిస్తున్నారంటూ.. బీజేపీ నేతలు చేసిన ఆరోపణలను పార్టీ నేత కాశీనాథ్ తోసిపుచ్చారు. ఆదివారం కోటకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసమే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీపీఐ ఎప్పుడూ ప్రజలు, వ్యాపారస్తుల శ్రేయస్సు కోసమే పనిచేస్తుందన్నారు.