SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని హైస్కూల్లో శనివారం పాఠశాల సౌకర్యాలు, నిర్వహణపై PTM సమావేశం నిర్వహించారు. ఇందులో ఎంఈవో నాగారం శ్రీనివాస్ మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యాబోధన మెరుగుపరచాలని సూచించారు. అంతేకాకుండా పాఠశాలలో పరిశుభ్రత, సౌకర్యాలు సమస్యలపై అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఛైర్మన్, పంచాయతీ కార్యదర్శిలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తనిఖీ చేయాలన్నారు.