BDK: ప్రకృతి వైపరీత్యాలు, ఇతర విపత్తుల సమయంలో సమర్థవంతమైన స్పందనతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ముందస్తు అప్రమత్తత అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 22న విపత్తుల నిర్వహణపై మాక్ డ్రిల్ నిర్వహించాలని శనివారం సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.