గుంటూరు నగర ప్రజలు జనవరి నుంచి తడి, పొడి వ్యర్ధాలు వేరుచేసి ఇచ్చేలా అవగాహన కల్పించడానికి చర్యలు చేపడుతున్నామని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఇందులో భాగంగానే ప్రజారోగ్య కార్మికులు, మెప్మా రీసోర్స్ పర్సన్స్‌కి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజారోగ్య కార్మికులు, మెప్మా కార్మికులతో శనివారం సమావేశం నిర్వహించారు.