NGKL: పంచాయతీ ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్లోని గాంధీ భవన్లో అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ ఆయనను కలిశారు. నియోజకవర్గంలోని 174 పంచాయతీలకు గాను 127 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారని ఎమ్మెల్యే వివరించారు.