ELR: చింతలపూడి మండలం రేచర్లలో శనివారం DFS జిమ్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను స్థానిక ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి, టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించారు. ఆయన బ్యాట్ పట్టి కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతగానో తోడ్పడతాయన్నారు