భారత్ టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఆటతీరుపై తనే అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ఈ సిరీస్లో మేం చేయాలనుకున్నదంతా చేశాం. కానీ.. ‘బ్యాటర్ సూర్య’నే మిస్ అయ్యాడు. కచ్చితంగా మరింత బలంగా తిరిగొస్తాడు’ అని పేర్కొన్నాడు. కెప్టెన్గా ఈ సిరీస్ తనకు సంతృప్తిని ఇచ్చిందని తెలిపాడు.