Bhoomika vasisht: ఆ నటి సీక్రెట్ వీడియో లీక్ చేసేశారు!
సినిమా వాళ్ల లైఫ్ అందరికీ తెలిసిందే. బిగ్ స్క్రీన్ పై కనిపించినంత బ్యూటీఫుల్‌గా వాళ్ల రియల్ లైఫ్ ఉండదు. ఎన్నో అవాంతరాలు, అవమానాలు ఎదుర్కొని.. నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలు జీవితంలో చెరిగిపోని తప్పు చేసేలా చేస్తాయి. తాజాగా అదే విషయాన్ని చెబుతూ.. ఓ నటి చాలా ఎమోషనల్ అయింది. ఆమె ప్రైవేట్ వీడియో లీక్ చేశారని ఆవెదనుకు గురైంది.
ఈ మధ్య బుల్లితెర పై వస్తున్న రియాల్టీ షోలు ఎన్నో ఉన్నాయి. స్టార్ హీరోలు, హీరోయిన్లు మొదలుకొని.. జూనియర్ ఆర్టిస్ట్ వరకు ఈ రియాల్టీ షోలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా వాళ్ల జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ బాదపడిపోతున్నారు. తాజాగా స్ప్లిట్స్‌విల్లా కంటెస్టెంట్ భూమిక వశిష్ట్ తనకు జరిగిన ఓ బ్యాడ్ ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చింది. రీసెంట్గా ఎంటీవీ రోడీస్ రియాల్టీ షో కొత్త సీజన్ ప్రారంభమైంది. భూమిక వశిష్ట్ ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా తను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వెల్లడించింది.
‘నేను డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొన్న తర్వాత మంచి ఫేమ్ వచ్చింది. దాంతో.. నేను కూడా సెలబ్రిటీలాగే ఉండిపోవాలనుకున్నాను. అయితే.. సెలబ్రిటీ లైఫ్ అనేది అంత సులువు కాదు. అది డబ్బుతో కూడుకున్న పని. అయినా సరే.. ఫేమ్, గ్లామర్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. నలుగురిలో మంచి స్థాయిలో ఉండాలన్న ఉద్దేశంతో.. నా లైఫ్‌స్టైల్ కోసం చాలా అప్పు తీసుకున్నాను. కానీ ఒక దశలో నేను ఆ అప్పు తీర్చలేని స్థితికి చేరుకున్నాను. అప్పుడు నేను హద్దు దాటాల్సి వచ్చింది. ఆ అప్పు తీర్చేందుకు ఒక యాప్ దుస్తులు విప్పుతున్న న్యూడ్ వీడియో చేశాను. అయితే ఆ వీడియోని సీక్రెట్‌గా ఉంచాల్సింది పోయి.. ఎవరో ఆన్లైన్లో లీక్ చేశారు. దాంతో నాపై చాలా విమర్శలు వచ్చాయి.. డిప్రెషన్ కు వెళ్లిపోయాను’ అని ఆవేదన వ్యక్తం చేసింది భూమిక. దాంతో ఆ షో జడ్జీలు భూమికను ఓదార్చారు. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి అనుభవాలు ఎదురైన నటులు ఎంతో మంది ఉన్నారు.