CTR: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దని MLA జగన్ మోహన్ అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం లక్ష్మీ నగర్ కాలనీలోని MLA కార్యాలయం ప్రజాదర్బార్లో PGRS కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వినతుల స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పలు సమస్యలపై అర్జీదారులు మళ్లీమళ్లీ వస్తున్నారని, ఈ విషయంలో అధికారులు శ్రధ్ధ చూపాలన్నారు.